AP: వైఎస్ జగన్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ ఇప్పుడొచ్చి అబద్ధపు సానుభూతి నటన కనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. "మద్దతు ధరలు, రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత జగన్‌కు లేదు. రైతులకు అండగా నిలబడటం అంటే డ్రామాలు కాదు. క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపించాలి. ఉల్లి, టమాటా రైతుల దీనస్థితి అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు." అని అన్నారు.