AP: డీఎస్సీ విజయవంతంపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. ‘‘ఐదేళ్లలో జగన్ ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. కూటమి తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి యువతకు అండగా నిలిచిందన్నారు. డీఎస్సీ విజయవంతం చేసినందుకు అభ్యర్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని తెలిపారు.