జగన్‌.. దమ్ముంటే సభకు రావాలి: మాజీ మంత్రి సోమిరెడ్డి

AP: ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రావడం లేదని జగన్‌ చెబుతున్న తీరు తప్పని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. 1994లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వచ్చినా ప్రతిపక్ష హోదా రాలేదని, 1984లో పార్లమెంట్‌లో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీ అయినా ఆ హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. అయినా ఎవరూ సభను బహిష్కరించలేదన్నారు. ‘‘జగన్‌ దమ్ముంటే సభకు రా, మద్యం కుంభకోణం, ఇళ్ల నిర్మాణాలు సహా ఏ విషయంపైనా చర్చకు సిద్ధం’’ అన్నారు. షరతులు పెట్టి దూరంగా ఉండడం పిరికితనమని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్