మెడికల్‌ కాలేజీలపై జగన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి

AP: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మెడికల్‌ కాలేజీలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. జగన్ చెప్పిన 17 మెడికల్‌ కాలేజీల్లో ఐదు కాలేజీలు కేంద్ర సహకారంతో నిర్మించారని మంత్రి వెల్లడించారు. మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.975 కోట్లు మాత్రమే జగన్ వినియోగించారని.. రాష్ట్రం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆ 17 కాలేజీల్లో ఒక్కటి కూడా వందశాతం పూర్తికాలేదని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్