AP: వైసీపీ అధినేత జగన్ విజయవాడలో పర్యటిస్తున్నారు. జగన్‌ను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో పలువురు చిన్నారులను జగన్ ఎత్తుకున్నారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.