AP: కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఎవరూ ఉండొద్దని హెచ్చరించడం, రైతుల బైక్‌ల తాళాలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకున్నారు. రైతులను వెళ్లనివ్వరా? ఇదెక్కడి అరాచకం అంటూ పోలీసుల తీరుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు.