AP: మాజీ సీఎం జగన్ అనకాపల్లి పర్యటనపై టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పర్యటన బలప్రదర్శనకే చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమే అని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని గంటా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, అవసరమైతే జగన్‌ను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ నేతలు ఎలాగైనా పర్యటన కొనసాగిస్తామని సవాల్ చేస్తున్నారు.