ప్రతిపక్ష హోదా కోసం జగన్ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారని హోం మంత్రి అనిత ఆదివారం చెప్పారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించడానికి ఇది ఒక ముఖ్యమైన వేదిక అని.. హోదా స్పీకర్ ఇచ్చే అంశం కాదని, ప్రజలు ఇచ్చే హక్కు అని గుర్తు చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలి.. ఒకవేళ ఆయన రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని అన్నారు.