తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు జగన్ పర్యటన

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మంగళవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పెనమలూరు, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. అక్కడ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులకు భరోసా ఇస్తారు. అనంతరం అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లికి చేరుకుంటారు.

సంబంధిత పోస్ట్