సెప్టెంబర్ చివరి వారంలోపు జగన్ జైలుకేళ్లడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్

AP: సెప్టెంబర్ నెల చివరి వారంలోపు వైసీపీ అధినేత జగన్‌ అరెస్టు కావడం ఖాయం అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. జగన్‌కు సంబంధించిన బెంగళూరు, HYD, తాడేపల్లి, పులివేందుల ప్యాలెస్‌లలో దాడులు జరిపితే వేల కోట్ల రూపాయలు, బంగారం దొరుకుతుందని అన్నారు. కాగా 2014 నుంచి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసులకు భయపడే బీజేపీకి జగన్ మద్దతు ఇస్తున్నాడన్నారు.

సంబంధిత పోస్ట్