ఈ నెల 13 వరకు జోగి రమేశ్‌కు రిమాండ్

AP: నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. వీరిద్దరిని విజయవాడ జైలుకు తరలించనున్నారు. దీంతో నకిలీ మద్యం కేసులో నిందితుల సంఖ్య 23కి చేరింది. జోగి రమేశ్‌ను ఏ18గా, రామును ఏ19గా పేర్కొన్నారు. కాగా, వైద్య పరీక్షల కోసం జోగి రమేశ్‌ను ఆసుపత్రికి తరలించినప్పుడు ఆయన కుటుంబసభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్