AP: కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల వల్లే రైతులకు న్యాయం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... ఈ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 4041 రైతు సేవా కేంద్రాలు, 3803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తామని, గత ఏడాది అనుభవాల దృష్ట్యా 6 కోట్ల గోనె సంచులు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.