కడప జిల్లా పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడుకు కడప విమానాశ్రయంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నర్సింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అలాగే జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా జమ్మలమడుగు మండలంలో నూతన పెన్షన్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి బయలుదేరారు.