కమలాపురం మండలం అప్పారామ్ పల్లిలో గురువారం టిడిపి నేతలైన అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో తమ్ముడు మూల విశ్వనాథరెడ్డి (45) మృతి చెందాడు. బడెతో తలకు గాయం కావడం లేదా ద్విచక్రవాహన ప్రమాదం కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కడప డిఎస్పి వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.