కమలాపురం: మాకు దారి చూపించండి.. మహాప్రభో

కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఎంపీడీవో కాలనీలో స్థానికులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాలనీలో సిమెంట్ రోడ్డు లేకపోవడంతో వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిపై అధికారులు స్పందించి దారి చూపాలని వెంకటేశ్, అఖిల్, చంద్ర, మల్లికార్జున రెడ్డిలు వర్షపు నీటిలో నిలబడి అధికారులను వేడుకున్నారు. ఈ నిరసన ద్వారా తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావాలని వారు ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్