వల్లూరు: బాలికల చదువుతో దేశాభివృద్ధి

వల్లూరు ఎంపీడీవో రఘురాం మాట్లాడుతూ, సమాజంలో బాలికల చదువుతోనే దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. శనివారం వల్లూరు కేజీబీవీలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, వాటి అనర్థాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్