వీరపునాయునిపల్లె: పాపఘ్ని నదిలో మునిగి బాలుడి దుర్మరణం

శుక్రవారం కమలాపురంలోని ఎర్రబల్లె కొత్త పల్లెలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన లింగాల మండలం అంబకపల్లెకు చెందిన కొందరు, తిరిగి స్వగ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో వీరపునాయునిపల్లె మండలం అనిమెల సంగమేశ్వర ఆలయం వద్ద ఆగారు. అక్కడ పాపఘ్ని నది వద్ద సెల్ఫీలు దిగుతుండగా, కృష్ణా రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి (13) నదిలో దిగి గల్లంతయ్యాడు. తోటివారు గమనించక ముందుకు వెళ్లిపోగా, బాలుడు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చి వెతకగా మృతదేహం లభ్యమైంది. ఎస్సై మంజునాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్