మదనపల్లెలో చీటీ డబ్బు వివాదం ఘర్షణకు దారితీసింది. సీటీఎం రోడ్డు శివాజీ నగర్‌లో నివసించే రెడ్డి ప్రసాద్(24) తన తల్లిపై గొడవకు వచ్చిన వారిని అడ్డుకోగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. బాధితుడు స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.