మదనపల్లెలో ట్రాక్టర్ బోల్తా – తృటిలో ప్రమాదం తప్పింది

మదనపల్లెలో శనివారం పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ముదివేడు నుంచి టమోటా లోడ్‌తో మదనపల్లె మార్కెట్టుకు వస్తున్న ట్రాక్టర్ నీరుగట్టుపల్లె రింగ్ రోడ్డులో అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌లో ఉన్న టమోటా క్రేట్లు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోపై పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్