చిత్తూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం, వీకోట మండలం జనప్పల్లెకు చెందిన వెంకటరమణ అనే యువకుడు ఆస్తి తన పేరు మీద రాయడానికి తల్లి నిరాకరించడంతో మనస్తాపానికి గురై విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తండ్రి మరణం తర్వాత ఆస్తి తల్లి తిమ్మక్క పేరు మీదకు మారింది. ఈ ఘటనపై అవుట్‌పోస్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. వెంకటరమణను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.