గురువారం మదనపల్లి మండలంలోని చిప్పిలి, వేంపల్లి, పోన్నేటి పాళ్యం, చీకలబైళ్లలో పంట నష్టాలను వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పరిశీలించారు. మొంథా తుఫాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పిపిపి విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం కూడా నిర్వహించారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరువ పనులను త్వరగా పూర్తి చేయాలని నిసార్ సూచించారు.