బాలికలు అన్ని విషయాలలో అవగాహన కలిగి ఉండాలి

అక్టోబర్ 11న బాలికల దినోత్సవం సందర్భంగా, మైదుకూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవి మంగళవారం బహుమతులు అందజేశారు. బాలికలు చదువుతోపాటు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలలో అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా యాంటీ ట్రాఫింగ్, బాల్య వివాహాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్