బెట్టింగ్ మాఫియాపై ప్రొద్దుటూరు పోలీసుల కొరడా

ప్రొద్దుటూరు పోలీసులు బెట్టింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జగన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, తన బ్యాంక్ ఖాతాలను బెట్టింగ్‌ల కోసం ఉపయోగించినందుకు 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ప్రొద్దుటూరుకు చెందిన వీర శంకర్, చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రవితేజ, మరియు పోరుమామిళ్ళ (M) నాయునిపల్లెకు చెందిన చంద్ర ఉన్నారు. ఈ చర్యలు బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడేవారిలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్