చింతకొమ్మదిన్నె: కారులో వచ్చి విద్యార్థిని కిడ్నాప్

కడప-పులివెందుల రహదారిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల వద్ద విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దసరా సెలవుల నేపథ్యంలో కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిని తోసేసి, కుమార్తెను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారు నంబరు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి, ఎర్రగుంట్లలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ముద్దనూరు మండలం బొదగుంట్ల గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్, అతని తమ్ముడు రాజేష్, స్నేహితులు అరవింద్, సురేంద్రగా గుర్తించారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్