పులివెందులలో గోమాతకు అంత్యక్రియలు

పులివెందులలోని భాకరాపురం ప్రాంతంలో ఓ గోమాత విషపు పురుగు కరవడంతో మంగళవారం మృతి చెందింది. శ్రీ రంగనాథ ట్రస్ట్ సీఈవో రంగనాయకులు ప్రత్యేక చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. దీంతో స్థానిక భాకరాపురం వాసులు గోమాతను కదిరి రోడ్ సమీపంలోని ఆటోనగర్ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి తరలించి, భక్తి భావంతో అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్