పులివెందులలో షాపు యజమానులకు పోలీసుల హెచ్చరికలు

పులివెందుల సీఐ సీతారామి రెడ్డి ఆదివారం పట్టణంలోని గుజిలీ షాప్ యాజమానులను పిలిపించి హెచ్చరించారు. రైతు పొలాల వద్ద మోటర్లకు అమర్చిన రాగి వైర్లను దొంగలు దొంగిలించి గుజిలీ షాపులలో విక్రయిస్తున్నట్లు గుర్తించామని, దొంగలు రాగి వైర్లు అమ్మడానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ దొంగల వద్ద నుంచి కొనుగోలు చేస్తే వారిపైనా దొంగతనం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్