పులివెందులలోని స్థానిక శ్రీ రంగనాథస్వామి సంత మార్కెట్ డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది. సంత మార్కెట్లో కుప్పలు తెప్పలుగా కుళ్ళిన కూరగాయలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూరగాయల నిల్వలు ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు అన్నారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారుల తూతూ మంత్రంగా పరిసరాల పరిశుభ్రత నిర్వహిస్తారని, మిగిలిన రోజులు పట్టించుకోరని వారు వాపోతున్నారు.