పులివెందుల: సోఫా సెట్ దుకాణంలో అగ్ని ప్రమాదం

పులివెందులలోని హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఉదయం ఒక సోఫా సెట్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దుకాణంలోని సోఫాలన్నీ కాలిపోయాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల లక్షల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్