పులివెందుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువకుమారెడ్డి, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దని మంగళవారం అన్నారు. పులివెందులలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆర్డీవో చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కోట్ల రూపాయలు పెట్టి ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు.