పులివెందుల: ఆర్ఎంపీలు ఓవర్ యాంటీబయోటిక్స్ వాడుతున్నారు

డిప్యూటీ డీఎంహెచో ఖాజా మొయిద్దీన్ మాట్లాడుతూ, ఆర్ఎంపీలందరూ ఓవర్ యాంటీబయోటిక్స్ వాడుతున్నారని, దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయని తెలిపారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ఆర్ఎంపీలపై చర్యలు తీసుకుంటామని, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్లు వేస్తున్న వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్