గురువారం ఉదయం సుండుపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) కొత్తగా ఎన్నికైన ఛైర్మన్, డైరెక్టర్లు కార్యాలయ ఆవరణలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సొసైటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.