మంగళవారం సాయంత్రం సిద్ధవటం మండలం చలమారెడ్డి కొట్టాలకు చెందిన గోపాలయ్య (75)పై ఎలుగుబంటి దాడి చేసింది. శ్రీలంకమల్ల అభయారణ్యం రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని వనేశ్వరం వంక ప్రాంతానికి వెళ్లిన ఆయనపై అకస్మాత్తుగా దాడి జరిగింది. తల, కన్ను, చెవి, దవడ వద్ద తీవ్ర గాయాలైన గోపాలయ్య గ్రామానికి చేరుకోగా, కుటుంబ సభ్యులు అతన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.