రాయచోటిలో అనుమతులు తప్పని సరి

రాయచోటి ఉపమండల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని అర్బన్ సీఐ బీవీ చలపతి సోమవారం తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు వంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలనుకునేవారు కనీసం రెండు రోజుల ముందు పోలీస్ స్టేషన్‌లో అనుమతి పత్రంపై సంతకం చేసి డీఎస్పీ అనుమతి పొందాలని సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్