రాయచోటి: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

కడప జిల్లా చక్రాయపేట మండలం కుప్పగుట్టపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున (46) మంగళవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని రాయచోటిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మల్లికార్జున మృతి చెందాడు. చక్రాయపేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్