ములకలచెరువు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

ములకలచెరువు సర్కిల్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సీఐ వెంకటేశులు సిబ్బందితో కలిసి పెద్ద తిప్పసముద్రం పెట్రోల్ బంకు సమీపంలో గురువారం అరెస్ట్ చేశారు. రాజోళ్ళ హరినాథ్ (29), మహమ్మద్ ఫరూక్ (19), రోషన్ బాష్ (17)ల వద్ద నుంచి రెండు కేజీలు గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం, రూ. 330 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో ఎస్సైలు హరిహర ప్రసాద్, నరసింహుడు, సిబ్బంది మహేష్, బావజాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్