ములకలచెరువు: తాగునీటి సమస్యపై గ్రామస్తుల నిరసన ధర్నా

ములకలచెరువు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం మద్దినాయునిపల్లి పంచాయతీ, ఉచ్చు వారిపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా తీవ్ర తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లక్ష్మీదేవి, రంగన్న, ఇతరులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ స్పందన లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్