గండేపల్లికి చెందిన బోసనకూరి రంగబాబు (40) అనే ఫోటో గ్రాఫర్ ఇటీవల భవానీ మాలధారణ చేపట్టారు. శనివారం రాజమహేంద్రవరం వెళ్తుండగా మురారి వచ్చే సరికి విజయనగరం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కారు అతని ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. గాయపడ్డ ఆయనను గ్రామస్థులు రాజానగరం ఆసుపత్రి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఢీ కొన్న కారు ఆగకుండా వెళ్ళిపోయింది. మృతుడికి చెవిటి, మూగతో ఉన్న భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.