జగ్గంపేటలో: సత్తెమ్మ తల్లికి బోనాలు సమర్పించిన మహిళలు

జగ్గంపేటలోని శెట్టి బలిజపేట శివారు పంట పొలాల్లో వెలసిన ధన సత్తమ్మ అమ్మవారికి శనివారం వందలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు. మహిళలు ముందుగా శెట్టిబలిజపేటలోని రామకోవెల వద్ద ఉన్న దేవి మండపం వద్ద పూజలు నిర్వహించి, అక్కడి నుంచి బోనాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ధన సత్తమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్