వరకట్న వేధింపులపై కేసు నమోదు

కాకినాడ మూడో పట్టణ పోలీసులు మంగళవారం అదనపు కట్నం ఇవ్వాలని భార్యను వేధిస్తున్న భర్త, అతని ఇద్దరు బంధువులపై కేసు నమోదు చేశారు. స్థానిక డెయిరీఫారం సెంటర్ కు చెందిన సంధ్యారాణికి పలాసకు చెందిన రాజుతో 2012లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భార్యను అదనపు కట్నంగా రూ. 10 లక్షలు తేవాలని భర్త, మరో ఇద్దరు బంధువులు కలిసి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, లేనిపక్షంలో విడాకులు ఇచ్చి మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటానని బెదిరిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్