కాకినాడకు చెందిన 17 ఏళ్ల బాలుడిని తల్లిదండ్రులు మందలించడంతో, అతను ఎవరికీ చెప్పకుండా మూడు రోజుల క్రితం తిరుమలకు వచ్చాడు. కొండపై ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని తిరుమల పోలీసులు గుర్తించి, SP సుబ్బారాయుడు ఆదేశాల మేరకు బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి, ఆధారాలు చూపిన తర్వాత బాలుడిని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.