కాకినాడ జిల్లాలో ఆర్టీసీకి దసరా తాకిడి

దసరా పండుగ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా బస్సులన్నీ కిటకిటలాడుతుండగా, మరోవైపు పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు జిల్లాకు వస్తున్న వారి కోసం ఆర్టీసీ అదనపు బస్సులను కేటాయించింది. ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీలను భరించలేక అత్యధిక శాతం మంది ఆర్టీసీని వినియోగంచుకుంటున్నారు.   గతంలో పండుగ సమయాల్లో ప్రైవేటు బస్సులకే ప్రాధాన్యత నిచ్చే జిల్లా ప్రజలు ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన స్త్రీశక్తి బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్