పిఠాపురం పాఠశాలలో తాగునీటి కష్టాలు: తండ్రి ఆదుకున్నాడు

పిఠాపురం మండలం కొత్తకందరాడ పాఠశాలలో విద్యార్థులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన విద్యార్థిని తండ్రి మాస శ్రీనుబాబు, తాత్కాలికంగా వాటర్ బాటిళ్లను విరాళంగా అందించారు. స్థానిక నాయకులను సంప్రదించి, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పాఠశాల హెచ్.ఎం. తిప్పన వరలక్ష్మి చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనుబాబును ప్రశంసిస్తూ, ప్రజాప్రతినిధులు, దాతలు త్వరగా స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పాఠశాల అభివృద్ధి పనులు చేస్తున్న ఎం.పి.పి. కన్నాబత్తుల కామేశ్వరరావును కూడా పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్