గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంలో మంగళవారం ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయం పిఠాపురం నుంచి చేబ్రోలుకి ఇటీవలే మారింది. దసరా నవరాత్రి మహోత్సవాలలో భాగంగా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలియజేశారు.