సోమవారం పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరగనుంది. పాడా పీడీ పి. వేణుగోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించి పరిష్కారం పొందవచ్చు.