తమ సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న యు. కొత్తపల్లి మండల మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ షన్మోహన్ బుధవారం చర్చలు జరిపారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, కాబట్టి ఆందోళన విరమించాలని కలెక్టర్ కోరారు. అయితే, డిప్యూటీ సీఎం స్వయంగా వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో కలెక్టర్ షన్మోహన్ వెనుదిరిగారు.