పిఠాపురం: పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభం

పిఠాపురం మండలం కొత్తకందరాడ యం.పి.పి. పాఠశాలలో దసరా సెలవుల సందర్భంగా పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టారు. యం.పి.పి. కన్నాబత్తుల కామేశ్వరరావు ఆధ్వర్యంలో చెట్లు కొట్టించడం, గ్రావెల్ పనులు వంటివి జరుగుతున్నాయి. ఈ పనులతో పాఠశాల అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూడటంతో పాటు, సెలవులు ముగిసేలోపు పనులు పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పాఠశాల హెచ్.ఎం. వరలక్ష్మి, తల్లిదండ్రులు యం.పి.పి. ని కలిసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మాస శ్రీనుబాబు, కుసుమ మురళి, పలివెల నరేష్ తదితరులు ఈ సందర్భంగా యం.పి.పి ని కలిశారు.

సంబంధిత పోస్ట్