పిఠాపురంలో మహారాజా విగ్రహానికి సంప్రోక్షణ

పిఠాపురం మహారాజా విగ్రహాన్ని కబ్జాదారుడు మలినం చేశారని, దీనిపై మహారాజా కుమారుడు రామ రత్నారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పిఠాపురం పట్టణంలో కోటగుమ్మం సెంటర్ లో ఆయన విగ్రహానికి పాలతో సంప్రోక్షణ చేశారు. ఆస్తులు కబ్జా చేసిన వ్యక్తి దండ వేయడం వల్ల మహారాజా ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, తమ ఆస్తిని ప్రజలకు అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్