ప్రత్తిపాడు నియోజకవర్గ అవసరాలపై రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వినతిపత్రం అందజేశారు. ప్రత్తిపాడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లంపకలోవలో హైస్కూలు ప్లస్ ను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.