అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణ బుధవారం కన్నుల పండువగా సాగింది. తొలిపావంచాల వద్ద నుంచి ప్రారంభమైన సత్యరథం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు. సుమారు 8.2 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా, సాయంత్రం పంపా సరోవరంలో హారతి, రాత్రి పావంచాల వద్ద జ్వాలా తోరణం, గ్రామోత్సవం జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు, భారీ వాహనాలకు అనుమతిని నిషేధించారు.