AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు. దాదాపు 15 నెలల తర్వాత తాడిపత్రికి వస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్పీ జగదీశ్ 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని పెద్దారెడ్డి చెప్పారు.